ధన్ వాపసికి ఇది సమయం

భారతదేశం సంపన్నమైనది, కానీ భారతీయులు పేదవారు. దీనిని మార్చడానికి ఇదే సమయం.

ప్రతి భారతీయ కుటుంబానికి భారతదేశ ప్రజా సంపదలో రూ. 50 లక్షల వాటా ఉంది. 1 లక్ష తిరిగి అందించాల్సిన సమయం. అందువల్ల మేము ఎల్లప్పుడూ పేదరికం, నిరుద్యోగం మరియు అవినీతికి సంబంధించిన సమస్యలను ఎప్పటికైనా పరిష్కరిస్తాము.

ఇది ఒక గొప్ప ఆలోచన. ప్రజా సంపద అంటే ఏమిటి, మనం ఎందుకు దానిని తిరిగి పొందాలి మరియు మనం కలిసివుంటే దీనిని ఎలా చేయగలమో నేను వివరిస్తాను.

***

నేను రాజేష్ జైన్ .నేను రాజకీయ నాయకుడిని కాదు. నేను సమస్యను పరిష్కరించేవాడిని, వ్యాపారవేత్తని. 25 సంవత్సరాలుగా, నేను సాంకేతిక ప్రపంచంలో లక్షలాది సమస్యలు పరిష్కరించాను.

1990ల చివరలో, నేను ప్రపంచవ్యాప్తంగా భారతీయులకు సమాచార అంతరాన్ని నిర్మించడానికి భారతదేశం యొక్క మొట్టమొదటి ఇంటర్నెట్ పోర్టల్స్‌‌‌‌ని ఏర్పాటు చేశాను. మీలో కొందరు పాతవారు అయితే కొన్ని వెబ్‌‌‌సైట్‌‌‌లను గుర్తించుకొని ఉండవచ్చు- Samachar.com, Khoj.com, Khel.com మరియు Bawarchi.com. ఇప్పుడు, నా కంపెనీ బ్రాండ్స్ తమ వినియోగదారులకు సత్సంభందాలను రూపొందించడానికి సహాయపడుతుంది.

2008లో నా జీవితం యొక్క దిశ మారింది - అప్పుడే నాకు నయి దిశ గురించి తెలిసింది. ఇది ఒక స్నేహితుడు నన్ను అడిగిన ప్రశ్న నుండి వచ్చింది, "రాజేష్, మీ 3 ఏళ్ల కుమారుడు పెరిగి మిమ్మల్ని ఇలా అడుగుతాడు - నాన్నా, భారతదేశంలో అన్నీ తప్పుగా జరిగుతుందని మీరు చూశారు. మీకు సమయం మరియు డబ్బు ఉంది. మరి దాని గురించి మీరు ఎందుకు ఏమీ చేయలేదు? ఈ ప్రశ్న నాతో కొత్త ప్రయాణాన్ని ప్రారంభింపజేసింది

భారతదేశాన్ని మార్చేందుకు రాజకీయాలను ఎలా వినియోగించాలో చూడడమే నా పరిష్కారం. కొద్దిమందితో కలిసి, 2009 లో లోక్‌సభ ఎన్నికలకు ముందే నేను ఫ్రెండ్స్ ఆఫ్ బి.జె.పిని ఏర్పాటు చేసుకున్నాను.

2011 లో పబ్లిక్ బ్లాగ్ పోస్ట్ నేను తదుపరి ఎన్నికలలో బి.జె.పి లోక్‌సభ మెజారిటీని ఎలా గెలుచుకుంటుందని పబ్లిక్ బ్లాగ్‌‌‌లో ఒక పోస్ట్‌ను రాశాను. 2012 లో, నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారానికి నా స్వంత నిధులతో మీడియా, డేటా, విశ్లేషణలు మరియు స్వయంసేవకంగా పనిచేసే 100 మంది వ్యక్తులను ఏర్పాటు చేశాను. 2014 ఎన్నికలలో, బి.జె.పి సొంతంగా మెజారిటీ సాధించింది, మోడీ భారతదేశం యొక్క ప్రధానమంత్రి అయ్యారు.

పాలకులు మారినా, నియమాలు ఒకే విధంగా ఉన్నా, ఫలితాలు మారవు అని నేను తెలుసుకున్నాను. 71 సంవత్సరాలపాటు, 20 ప్రభుత్వాలు మరియు 3 తరాల భారతీయులు రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ పేదరికం, నిరుద్యోగం మరియు అవినీతికి పరిష్కారం పూర్తిగా దొరకలేదు. కానీ కొంచెం మారింది. ఈ సమస్యలు ఎల్లప్పుడూ మనతోనే ఉన్నాయి. భారతదేశానికి నయి దిశ,ఒక కొత్త దిశ అవసరం. ఇది ఆలోచనలో నుండి పుట్టింది. ధన్ వాపసి

***

మన ప్రశ్నలకు తిరిగి వద్దాం. మన ధన్ ఎక్కడ ఉంది? భారతదేశ ప్రజాసంపద అంటే ఏమిటి? ? ప్రజా సంపద, ఖనిజ నిక్షేపాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, మరియు వారి ఆస్తులే ఈ సంపద. ఈ సంపదలో మనమందరం వాటాదారులం. ఈ సంపద విదేశీ బ్యాంకులలో లేదు, ఇది భారతదేశంలోనే మన చుట్టూ ఉంది. ఇది నల్ల డబ్బు కాదు, ఇది మన డబ్బు. మరియు ఈ సంపద ఎంత? రూ. 1500 లక్షల కోట్లు. అంటే 15 పక్కన 14 సున్నాలు. ఇది భారతదేశంలోని ప్రతి కుటుంబానికి 50 లక్షల రూపాయల వరకు వస్తుంది.

భారతదేశం సంపన్నమైనది, కానీ ఇంకా భారతీయులు పేదవారిగానే ఉన్నారు. సగటుగా భారతీయ కుటుంబం ఒక సంవత్సరంలో రూ.1 లక్ష కన్నా ఎక్కువ సంపాదిస్తుంది - ఐదుగురు ఉన్న కుటుంబంలో నెలకు రూ. 10,000 కన్నా తక్కువ సంపాదిస్తున్నారు. వారు చాలా తక్కువ మిగలబెడతారు మరియు మనము మార్చవలసినది కూడా అదే. అందువల్లనే మన సంపద మనకి తిరిగి కావాలి.

ఈ సంపద రాజకీయ నాయకులు మరియు ప్రభుత్వాధికారుల నియంత్రణలో ఉంది. ముందు బ్రిటీష్ పాలకులు చేసినట్లుగా వీళ్లు మన సంపదను దోచుకున్నారు. వారు విలాసంగా నివసించడం చూడండి. వారు వైభవోపేత గృహాలు, సౌకర్యవంతమైన ప్రయాణం మరియు భారీ భద్రత కలిగి ఉంటారు - వాటి అన్నింటికీ మనం పన్నులు చెల్లిస్తున్నాము.

కాపలాదారులు జమీందార్లుగా మారారు.

ఈ దోపిడీని ఆపడానికి ఇదే సరైన సమయం. మన సంపదను తిరిగి డిమాండ్ చేయడానికి కూడా ఇదే సరైన సమయం.

ఈ సంపద తిరిగి పొందడం అంటే మన కుటుంబం కోసం ఎలా ఖర్చు చేయాలి అనేదానిని ఎంచుకోవచ్చు.

మనం ఖర్చు చేసేది అమ్మకందారులకు ఆదాయం అవుతుంది. మనం ఆహరం కోసం ఖర్చు చేస్తే అది రైతులకు ఆదాయం. మనం ఇతర వస్తువులను మరియు సేవలను ఖర్చు చేసినప్పుడు, అది ఉపాధిని పెంచడానికి మరియు ఉద్యోగాలను కల్పించడానికి సహాయపడుతుంది. వివిధ పథకాల ప్రయోజనాలను పొందిన రాజకీయ, అధికారిక నిర్ణయాధికారుల నిర్ణయాలు తొలగించినప్పుడు, అవినీతిని అంతం చేయవచ్చు.

ధన్ వాపసి అనేది ప్రయోగాత్మక పరిష్కారం, ఇది పేదరికం, నిరుద్యోగం మరియు అవినీతి అనే మూడు చెడులను తొలగిస్తుంది. ధన్ వాపసి విశ్వజనీన సంపద విప్లవం, మన రాజ్యాంగం యొక్క రూపకర్తలు భారతీయులందరికీ - పౌరులకు స్వేచ్ఛ, సమానత్వం మరియు సంపదలకు రక్షణ కల్పించడంపై దృష్టిసారించారు. మన స్వంత నియమాలపై జీవించటానికి నిజమైన స్వాతంత్రమే ధన్ వాపసి - మన యజమానిగా ప్రభుత్వం లేకుండా, పురోగతిలో తోటి భారతీయులే భాగస్వాములుగా ఉండాలి. ధన్ వాపసి నిజాయితీ మరియు న్యాయం గురించి చెపుతుంది. ధన్ వాపసి ప్రతి భారతీయుడి హక్కు.

***

కాబట్టి, మన సంపదను తిరిగి మనం ఎలా పొందవచ్చు? ధన్ వాపసి జరిగేలా ఎలా చెయ్యగలం? రాజకీయవేత్తలు మరియు అధికారులు మన సంపదను మనకి తిరిగి ఇవ్వడం లేదు. ఈ సంపద గురించి వారు మనకి ఏ మాత్రం చెప్పలేదు, వారు ఇప్పటికీ మన వద్ద నుండి దోచుకుంటున్నారు. నాయకులు మరియు అధికారుల నియంత్రణ నుండి మన సంపద విముక్తికై ధన్ వాపిసికి మరో స్వేచ్ఛా ఉద్యమం అవసరం.

మొదటి దశలో మనం మన బలాన్ని మంది ద్వారా చూపించాలి. మనం చాలామంది ఐక్యంగా ఉన్నప్పుడు మాత్రమే ధన్ వాపసి జరిగేటట్లు చేయవచ్చు. మనం మన గళాన్ని మరియు ఓటు శక్తిని ఉపయోగించడానికి సిద్ధమైనప్పుడు మాత్రమే మన రాజకీయ నాయకులు మరియు అధికారులను స్పందింపజేయగలం.

మన మందిని చూపించడానికి, DhanVapasi.com పై పార్లమెంట్ ప్రతిసంవత్సరం ప్రతి కుటుంబానికి రూ. 1 లక్ష తిరిగి ఇవ్వడానికి మేము ఒక పిటిషన్‌‌‌‌‌‌ వేశాము. మీరు మద్దతు ఇవ్వాలని నేను కోరుతున్నాను.

ఇది ప్రారంభ స్థానం. నా బృందం ప్రతి ఎమ్.పికి పంపించే ధన్ వాపసి బిల్‌‌‌ను సిద్ధం చేస్తోంది, కాబట్టి వారు దానిని చదవవచ్చు, చర్చించవచ్చు, చర్చలు చేసి, దానిని పాస్ చేయవచ్చు. కానీ వారు మన గళాన్ని వినేంత వరకు మరియు మన సమైక్య ఓటు యొక్క శక్తిని చూసేంత వరకు ఏమీ చేయరు.

***

సౌభాగ్యం మన జన్మ హక్కు, దానిని మనం తప్పని సరిగా కలిగి ఉండాలి.

కొన్ని సంవత్సరాల నుండి ఇప్పటి వరకు, ఎప్పుడైనా దగ్గరివారు లేదా తెలిసినవారు, "మీరు భారతదేశానికి ఏమి చేసారు" అని మిమల్ని అడిగితే? మీరు వాళ్ళ కళ్ళలోకి చూసి " నేను ధన్ వాపసిని జరిగేలా చేసాను" ప్రతి భారతీయుడిని ధనవంతునిగా చేశాను అని సమాధానం చెప్పవచ్చు.

స్నేహితులారా, స్పందించడానికి ఇదే సమయం. ఇప్పుడు మన వంతు.

వద్ద పిటిషన్‌కి మద్దతు ఇవ్వండి మరియు DhanVapasi.com మీ కుటుంబం మరియు స్నేహితులు మద్దతు ఇచ్చేలా చేయండి.

మంచి రేపటి కోసం ఈ రోజే స్పందిద్దాం.

జై హింద్.

వాగ్దానానికి మీ మద్దతును తెలపండి