ప్రతీ భారతీయ సంపన్నతను సంపాదించడానికి మార్గం వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడుతూ, వ్యక్తిగత ఆస్తిని రక్షిస్తుంది, చట్టం యొక్క పాలనను విధించింది మరియు ఉచిత మార్కెట్లను ప్రోత్సహిస్తుంది.


రాజేష్ జైన్

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ పేను మారుమోగిపోతుంది. ఈ పేరు తెలియనివాళ్లు ఉండరంటే అతిశయోక్తికాదేమో. ఆయనే టెక్నాలజీ వ్యవస్థాపకుడు, ఆసియా లోని అతిపెద్ద డాట్‌కామ్ రెసొల్యూషన్ సంస్థ మార్గదర్శకుడు రాజేష్ జైన్. ఈయన 1990 సంవత్సరంలో భారతదేశం లో మొట్టమొదటి ఇంటర్నెట్ పోర్టల్స్ ని సృష్టించారు. దాని తరువాత 'వాట్ ఈస్ టుడే' అనే పేరుతో భారతదేశంలోనే అతిపెద్ద డిజిటల్ మార్కెటింగ్ కంపెనీని ప్రారంభించారు. రాజేష్ జైన్ ఒకవైపు పారిశ్రామికవేత్తగా వేరొక డొమైన్ లో ఉంటూనే తన సొంత దేశపు పురోగతిని కోరుకున్నారు. అంతే కాకుండా భారత దేశానికి ట్రాన్స్ఫర్మేషన్ (పరివర్తన) అవసరం అనీ మనం కూడా రాజకీయ వ్యవస్థాపకులు గా ఉండాలని రాజేష్ అభిప్రాయపడ్డారు.

***

రాజకీయ వెంచర్స్

Dhan Vapasi, an initiative by Rajesh, is a political platform for making Indians prosperous.

ఇది భారతీయులను సంపన్నులుగా తయారుచేసే ఒక రాజకీయ వేదిక,నితి డిజిటల్ప్ర,రాజేష్ మునుపటి రాజకీయ-సాంకేతిక సంస్థ అయినటువంటి నితి డిజిటల్, ప్రధాన మంత్రి నరేంద్రమోడీ కోసం 2014 బిజెపి ఎన్నికల ప్రచారానికి మద్దతు ఇచ్చిన కీలక సంస్థల్లో ఒకటి. రైట్ -అఫ్-సెంటర్ డిజిటల్ మీడియా స్థలం (నితిసెంట్రల్ . కామ్), ఎన్నికల డేటా, విశ్లేషణలు (ఇండియావోట్స్.కామ్) స్వయంసేవ వేదిక (ఇండియా272.కామ్) లో రెండు సంవత్సరాల పాటు 100- మంది పనిచేసే వ్యక్తులతో ఒక బృందం వుండేది. జూన్ 2011 లో బిజెపికి ఓటు వేసేలా ప్రచారం చేయడంలో ప్రచారం చేసిన మొట్టమొదటి వ్యక్తిగా రాజేష్ గుర్తింపు పొందారు. ఏమార్జిక్.ఆర్గ్ బ్లాగ్ పోస్ట్ "ప్రాజెక్ట్ 275 ఫర్ 2014".

వ్యాపార వెంచర్లు

రాజేష్, పెద్ద సంస్థ వ్యవస్థాపకుడు నెట్‌కోర్ సొల్యూషన్స్ ,మొబైల్, ఇ-మొబైల్ ద్వారా డిజిటల్ రియల్ టైమ్ కమ్యూనికేషన్స్ ని భారతదేశానికి అందిస్తున్న వ్యవస్థాపకుడు. చైర్మన్, మల్టీ-ఛానల్ మార్కెటింగ్ ఆటోమేషన్, క్యాంపైగ్న్ మానెజ్మెంట్ సోలుషన్స్ యొక్క నిర్వాహకులు. నెట్‌కోర్ దాని ఉత్పత్తులు (ప్లాటుఫార్మ్ సోలుషన్స్) వేదిక పరిష్కారాల ద్వారా 2,000 భారతీయ మరియు అంతర్జాతీయ సంస్థలకు సేవలను అందిస్తోంది. దాని సందేశ మార్గాల ద్వారా నెలవారీగా 10 బిలియన్ సందేశాలను (ఇమెయిల్‌లు మరియు ఎస్ఎంఎస్) పంపుతుంది.

1995 లో ప్రారంభించిన రాజేష్ మొదటి వెంచర్లలో ఒకటైన ఇండియా వరల్డ్ కమ్యూనికేషన్స్నవంబర్ 1999 లో సత్యం ఇన్ఫోవే చేత ఆసియా యొక్క అతిపెద్ద ఇంటర్నెట్ ఒప్పందాల్లో ఒకటిగా 115 మిలియన్ డాలర్లు సంపాదించింది. భారత్-సెంట్రిక్ వెబ్సైటులలో భారత్ వరల్డ్, అతి పెద్ద సమాహారం (న్యూస్), ఖేల్ (క్రికెట్), ఖోజ్ (సెర్చ్) మరియు బావార్కి (ఫుడ్) ఉన్నాయి.

విద్య

1988 లో బాంబేలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి రాజేష్ తన బి. టెక్ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్) ని పూర్తి చేశారు. తరువాత న్యూయార్క్, కొలంబియా యూనివర్శిటీ నుంచి 1989సం లో ఎం.స్. ని పూర్తిచేశారు. ఆయన యూఎస్ లో పనిచేశారు. తాను భారతదేశానికి తిరిగి రావడానికి 2 సంవత్సరాల ముందు 1992 లో తన ఎంట్రెప్రేంయూరియాల్ వెంచర్స్ ని ప్రారంభించారు.

గుర్తింపు

రాజేష్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో గుర్తింపు పొందిన నాయకుడు. జాతీయ, అంతర్జాతీయ ఫోరంలలో నిర్వహించే కార్యక్రమాలకు ఈయనను స్పీకర్ గా ఆహ్వానించేవారు. టైం (2000) మరియు న్యూస్‌వీక్ (2007) లలో అతను కవర్ పేజీ కథనాల్లో కూడా మనకు కనిపించారు. ది ఎకనామిక్ టైమ్స్ సెప్టెంబర్ 2013 లో రాజేష్ కి భారతదేశపు ఉత్తమ స్ట్రాటజిస్ట్‌గా పేరు పెట్టారు.

***

రాజేష్ జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలు:


ఇండియా వరల్డ్: భారతదేశం లోని డాట్‌కామ్ రెసొల్యూషన్ చెందడం ప్రారంభించింది. మార్చ్ 1995 లో రాజేష్ భారతదేశం యొక్క మొట్టమొదటి ఇంటర్నెట్ పోర్టల్స్ ని ప్రారంభించారు. అది చాలా పెద్ద సంస్థగా మారింది. నవంబర్ 1999 లో ఆసియాలోనే అతి పెద్ద ఒప్పందాల్లో ఒకటిగా సత్యం ఇన్ఫోవే (తరువాత, సిట్ఫై) రాజేష్ 500 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు.

టైం, న్యూస్‌వీక్ మ్యాగజైన్స్ కవర్ పేజీ లో నిలిచారు: రెండు వినూత్న కార్యక్రమాలకు ఒక ప్రఖ్యాతి వ్యక్తిగా నిలిచారు. టైం మ్యాగజైన్ మార్చి 2000 లో ఆసియా ఇంటర్నెట్ బూమ్‌లో కవర్ కథలో రాజేష్ గురించి వివరిస్తూ ఎన్నో కథనాలు వెలువడ్డాయి. ఫిబ్రవరి 2006 న్యూస్ వీక్ మ్యాగజైన్ లో రాజేష్ $ 100 కంప్యూటర్ ప్రాజెక్ట్ (నోవాటియం) గురించి ప్రత్యేక కథనం వచ్చింది.

రాజేష్ ఒక రాజకీయ వ్యవస్థాపకుడిగా ఎలా అయ్యాడు: తన జీవితాన్ని మార్చివేసేలా చేసింది అతని స్నేహితులు. 2008 లో ఆయన స్నేహితుడు ఒకడు అతన్ని కొన్నింటిపై ప్రశ్నించినప్పుడు అతనిలో ఒక ఆలోచన వచ్చింది. సాంకేతిక రంగం నుంచి రాజకీయరంగంలోకి రాజేష్ పరివర్తనం చెందాల్సి వచ్చింది.

టెక్నాలజీ ద్వారా రాజకీయంలోకి: 2009 లో రాజేష్ బిజెపికి మద్దతు ఇవ్వడానికి అందుకు ప్రజల మద్దతు పొందడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఫ్రెండ్స్ ఆఫ్ బిజెపిని స్థాపించారు. 2010 లో, రాజేష్ మొట్టమొదటిసారిగా నరేంద్రమోడీని కలుసుకున్నారు. 2014 లో ఆయనను ప్రధానమంత్రిగా చేయాలనే సంకల్పంతో పని చేశాడు. 2011 లో, రాజేష్ బీజేపీ ప్రభుత్వం ఎలా అధిక మెజారిటీ తో గెలుస్తుందని " ప్రాజెక్ట్ 275 ఫర్ 2014" పేరుతో ఒక బ్లాగ్ పోస్ట్ ని కూడా రాశారు. మోడీ ప్రచారానికి మీడియాతో పాటు రాజేష్ చాలా మద్దతునిచ్చాడు. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి "నితి డిజిటల్" మోదీ విజయానికి కారణం అయ్యాడు. 100 మంది సభ్యులతో కలిసి నితి డిజిట్ నడిపించాడు.

2014 ఎన్నికల ప్రగతి, 2011 లో బిజెపి మిషన్ వెనుక ఉన్న రహస్యాలు 272+. రాజేష్ కొన్ని కథనాల ద్వారా వివరించారు. "బిజెపి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పరచాలంటే 175 లేదా 275 సీట్లు (లేదా ఎన్డీఏ మిత్ర పక్షాలతో 225 + 45) రావాలని భావించాడు. 275 సీట్లు గెలవాలంటే చాలా రకాలుగా ప్రణాళికలు రూపొందించాలి. 350- ఆడ్ సీట్లలో ఆ 275 స్థానాలను పొందేందుకు, బిజెపి ఎన్నికల్లో చాలా శ్రమించాల్సిన అవసరం కూడా అప్పట్లో ఏర్పడింది. అందుకు తగ్గట్లుగా రాజేష్ చాలా ప్రణాళికలు రూపొందించాడు. ఆయన రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వేల ప్రకారం బీజేపీ 175 స్థానాలు వస్తాయని అప్పట్లో తేలింది. కాంగ్రెస్ 150 వస్తే బిజెపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కష్టమే. అయితే భారతదేశానికి చివరిగా 1984 లో వేవ్ ఎన్నికలు జరిగాయి. తర్వాత 2014 లో బిజెపి తన సత్తా చాటేందుకు దేశవ్యాప్తంగా, బిజెపి బలంగా ఉన్న 330-350 సీట్లలో గెలవాల్సిన అవసరం ఏర్పడింది. అయితే ఇందుకు మిత్రపక్షాల సహకారం కూడా చాలా అవసరం అయ్యింది. మొత్తానికి అన్ని రకాల ప్రణాళికలు రూపొందించుకుని చివరికి 2014 మేలో బీజేపీ 282 స్థానాలను గెలుచుకుంది.

ఖేల్. కామ్, ఇండియావోట్స్. కామ్ ఖేల్. కామ్, ఇండియావోట్స్. కామ్. లను రాజేష్ 1997 లో రాజేశ్ ఏర్పాటు చేశాడు. మొట్టమొదటి క్రికెట్ సైట్ కెల్.కామ్. దీన్ని ఈయనే స్థాపించడం గర్వకారణం. ఖేల్. కామ్ అనేది జనాల ఆదరణ చూరగొంది. ప్రతి మ్యాచ్ అందులో వచ్చేది. దీంతో క్రికెట్ క్రీడను జనాల్లోకి ఈయన మరింత తీసుకెళ్లగలిగారు. ఇక 2012 లో ఎన్నికల సమాచారంతో ఇండియావోట్స్. కామ్ అనే సైట్ ప్రారంభించారు రాజేష్. జాతీయ, రాష్ట్ర ఎన్నికల సమాచార ఫలితాల వివరాలను అనేక రాజకీయ విషయాలను అందులో పొందుపరిచి జనాలకు అందించాడు.

The journey from Niti Digital to Dhan Vapasi:
Rajesh spent time in the past years reading, talking to people and thinking – to understand a very basic question: why are Indians not rich? The answer was simple but non-intuitive: Indians have too much government, and too little freedom. Governments do not create prosperity; people do.Unfortunately, all governments have essentially been the same – they all focus on growing the size and scope of the government; their only difference lies in the packing and selling. In India, constraints are put on individuals while giving a free hand to governments – exactly the opposite of what is needed to make Indians prosperous.

రాజేష్ నమ్మకం: రాజేష్ ఒక పెద్ద పారిశ్రామికవేత్త. టెక్నాలజీని విస్తరింపజేయాలని ఆయన ఆలోచించాడు. తర్వాత రాజకీయాల గురించి తెలుసుకున్నాడు. వాటి విజయం కోసం పని చేశాడు. అయితే ఆయనకు ఉండే మనస్సులో ఉండేది ఒక్కటే. చిన్ని చిన్న నిర్ణయాలు.. ప్రణాళికలు విజయాలు సాధించలేవు. ఏదైనా చేస్తే పెద్దగానే ఉండాలి...పెద్ద నిర్ణయాలు తీసుకుంటేనే జాతి భవిష్యత్తు బాగుంటుందని ఆయన నమ్మకం. ఆయన ఆ సిద్దాంతాన్నే నమ్మాడు. అదేబాటలో పయనిస్తున్నాడు. ”

Rajesh’s next goal: making Indians prosperous. Rajesh has done a few impossible things in his life for himself. This time through Dhan Vapasi, he wants to do it for 130 crore Indians.

మీరు ఆయనకి ఇక్కడ ఉత్తరం రాయవచ్చు rajesh@nayidisha.com.