వీడియోలుView All

మా అగ్ర ఎంపికలు

రాజేష్ జైన్
Nayi Disha

మార్పునకు ఇదే మంచి స‌మ‌యం

వ‌చ్చే ఏడాది జ‌రగ‌బోయే క‌న్నా మంచి అవ‌కాశం మ‌న‌కి మ‌ళ్లీ దొర‌క‌దు. 2014 ఎన్నిక‌ల్లో బిజేపీ గెలిచిన‌ప్ప‌టికీ (అప్ప‌డు నేను కూడా నీతి డిజిట‌ల్ ద్వారా ప‌నిచేశా) వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా అదే జ‌రుగుతుంద‌ని క‌చ్చితంగా చెప్ప‌లేము. ఎందుకంటే వాగ్ధానం చేసిన విధంగా సంస్క‌ర‌ణ‌లేమీ జ‌రుగ‌లేదు. చిన్న ప్ర‌భుత్వం - పెద్ద పాలన పేరుతో చేసిన వాగ్ధానాన్ని అస్స‌లు నెర‌వేర్చుకోలేదు. ఆ ప‌దాల తాలూకు అర్ధాన్ని కూడా వారు తెలుసుకోలేక‌పోయారు. బంగారు భ‌విష్య‌త్తు కోసం ప్ర‌జ‌లు పెట్టుకున్న ఆశ‌ల్ని వారు అన్ని విభాగాల‌లోనూ నాశ‌నం చేశారు.

Rajesh Jain
February 1, 2018

రాజేష్ జైన్
Nayi Disha

న‌యీ దిశా తెచ్చే పెను మార్పు

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ముందే మేము ఒక స్ప‌ష్ట‌మైన ఎంపిక‌ను ఎదుర్కొంటున్నాము. అన్ని రాజ‌కీయ‌పార్టీలు విభ‌జ‌న పేరుతో పెట్టిన ఉచ్చులోనే మేం కూడా ప‌డిపోయే అవ‌కాశం ఉంది. రాజ‌కీయ నాయ‌కులు ద‌శాబ్ధాలుగా మ‌నల్ని కులం పేరుతో, మ‌తం పేరుతో విభ‌జించారు. పొరుగున ఉండేవారిని చూసే భ‌య‌ప‌డే ప‌రిస్థితి క‌ల్పించారు. దీర్ఘ‌కాలంగా మ‌ర్చిపోయిన చ‌రిత్ర‌నే త‌వ్వి ప‌దే ప‌దే గుర్తు చేస్తున్నారు. గ‌తాన్ని గుర్తు చేయ‌డం త‌ప్ప‌... రేప‌టి మ‌న కోసం ఏం చేస్తారో, భ‌విష్యత్తు ఆశ‌లు పెంచేలా ఎలాంటి యాక్ష‌న్ ప్లాన్ రూపొందించారో మాత్రం ఏ రాజ‌కీయ పార్టీ మాట్లాడ‌దు.

Rajesh Jain
January 31, 2018

రాజేష్ జైన్
Nayi Disha

బంధింపబడిన భారతీయుల సంపద

ఒక్కసారి మీ చుట్టూ చూడండి... మీ కంటికి కనిపిస్తున్న ఎన్నో ఇళ్లు ప్రతి ఊరిలో ఉంటాయి. ప్రతి ఊరిలో ఉన్న ప్రతి ఇంటికి చెందిన డబ్బులో చాలా భాగం ప్రభుత్వం తమ ఆధీనంలోనే ఉంది. అంతెందుకు కేంద్రమంత్రుల నివాసాలతో పాటూ అనేక బంగ్లాలు ఉన్న ల్యూటెన్ ఢిల్లీ ప్రాంతం నుంచి ప్రతి జిల్లాలో ఖాళీగా పడి ఉన్న ఖాళీ స్థలాల వరకు ఎన్నో ఆస్తులు ప్రభుత్వానికే చెందుతాయి. ల్యూటెన్స్ ఢిల్లీ ప్రాంతంలో ఉన్న ఒక్కో బంగ్లా ధర అయిదు వందల కోట్లకు తక్కువ లేకుండా ఉంటుంది. ఎప్పుడో వందల ఏళ్ల క్రితం నుంచి భారతదేశం అంతటా అనేక భూములు రక్షణ శాఖ ఆధీనంలోకి వెళ్లాయి. ఇలా ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ప్రతి ఎకరం భూమి... దేశ శ్రేయస్సు, సంపన్నతను నిరోధించే వ్యవస్థలో భాగమే.

Rajesh Jain
January 30, 2018

అన్ని కథనాలు

రాజేష్ జైన్
Nayi Disha

అధికారంలో ఉన్నవారు చాలా శక్తిమంతులు, ఒక మామూలు వ్యక్తి ఏం చేయగలడని మనం అనుకోవచ్చు.

అనుకోవచ్చు. కానీ దగ్గరగా చూస్తే, మనలో 2/3 వంతు మంది ఏ పార్టీని సమర్థించరనే విషయం కన్పిస్తుంది- ఎంతమంది అంటే మన దేశంలో అతి పెద్ద రాజకీయ పార్టీకి ఉన్న అండ మొత్తానికన్నా నాలుగు రెట్లు ఎక్కువమంది. మనల్ని విడదీసేవేమిటి అని ఆలోచించటం మానేసి, మనల్ని కలిపేవేంటి అని ఆలోచించడం మంచిది. మనం ఒక్క ఉమ్మడి వేదికపై కలిసికట్టుగా చేరామంటే, మనందరిలో మేటి వ్యక్తి ఎన్నుకోబడి అలాంటి వారి రాజకీయ దుష్ట పెత్తనాలను ఆపవచ్చు. ప్రజా సంపదలో మనకి హక్కుగా రావాల్సిన డబ్బు రావటం వలన, పన్నులు తగ్గటం వలన, మనం కష్టపడి సంపాయించుకున్న డబ్బు మన దగ్గరే ఎక్కువ మిగిలి ఉంటుంది, దానితో మనం మన భవిష్యత్తును నిర్మించుకోవచ్చు. 70 ఏళ్ల పాటు జరిగిన నష్టాన్ని పూడ్చటానికి ఒక తరం వారి పూర్తి శ్రమ చాలా అవసరం. ఈ సమృద్ధి విప్లవాన్ని ఎక్కువ కాలం ఇక వాయిదా వేయరాదు, ఆపకూడదు. మనలో దాగున్న శక్తిని నిద్ర లేపుదాం.

Rajesh Jain
January 29, 2018

రాజేష్ జైన్
Nayi Disha

బ్రీటీష్ గూండాగిరి 2.0 ను ముగించే సమయం వచ్చింది

మన చుట్టూ ఉన్న అవినీతిపరులు, అత్యాశపరులు, అధికారం పిచ్చి ఉన్న రాజకీయ నాయకులందరూ మన స్వేఛ్చ, హక్కులు, సంపదను లాగేసుకుంటున్నారు. తమ అధికారం గట్టిగా నిలిపి ఉంచుకోటానికి సమాజంలో ఒక వర్గాన్ని మరో వర్గంవైపు ఉసిగొల్పి పబ్బం గడుపుకుంటున్నారు. వారి పాలసీలు మనకి మెరుగైన ఉద్యోగాలను, మంచి భవిష్యత్తును ఇవ్వట్లేదు. భారతదేశంలో వచ్చిన ప్రతి ప్రభుత్వం, ఒక్కోదాని తర్వాత ఒకటి దేశాన్ని దీర్ఘకాలిక పేదరికంలోకి తోసి, మనల్ని సంపన్నబాటలో నడవనీయకుండా నియంత్రిస్తూ వస్తోంది. అధికారం, శక్తి కేవలం పై స్థాయి వారికి మాత్రమే ఆభరణంగా మారి, మామూలు పౌరులు మరియు ప్రజలకోసం పనిచేసే సంస్థలను ఇంకా నిస్సహాయులుగా మార్చి వేస్తోంది.

Rajesh Jain
January 27, 2018

రాజేష్ జైన్
Nayi Disha

మార్పు.. మనకుండే ఆశలు

ఆర్థికశాస్త్రం, ప్రజల ఎంపికల గురించి విస్తృతంగా చేపట్టిన సంభాషణలు, అందుకు సంబంధించిన పుస్తకాలు చదివినప్పుడు నాకు మూడు విషయాలు స్పష్టంగా అర్థమయ్యాయిః భారతదేశం.. పేదరికం రెండు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. భారతదేశంలో పేదరికం అనేది ప్రకృతిపరంగా, సహజంగా వచ్చింది కాదు. మనిషి తయారుచేసిందే. సంపన్న బాటలోకి నడవటానికి సంపదను సృష్టించడం ఒకటే మార్గం. సంపదను పంచుకోవటం మాత్రం కాదు. సంపదను పంచుకుంటూ పోవటం అనేది పురోగతి కాదు. సంపదను సృష్టించడం మాత్రమే సానుకూల పురోగతిని సూచిస్తుంది. సంపదను సృష్టించడానికి ఒక వ్యవస్థ ఉండేది. ప్రజలు తమ సంపదను సృష్టించుకునే మార్గంలో నడవటానికి, అలా నడిపించటానికి భారత పాలకులకి తగినంత జ్ఞానం, ప్రోత్సాహకాలు లేవు.

Rajesh Jain
January 26, 2018