ధన్ వాపసి పిటిషన్‌లో సంతకం చేయడం ద్వారా ప్రతి భారతీయుడిని ధనవంతునిగా మరియు స్వేచ్ఛగా ఉండేలా చేయండి

Responsive image

ప్రియమైన ప్రధానమంత్రి మరియు పార్లమెంట్ సభ్యులు,

భారతదేశం ఒక సంపన్నమైన దేశం, కానీ భారతీయులు పేదవారు. భారతీయులు ప్రజా సంపద అనగా భూమి, అస్థిరమైన ప్రభుత్వ-యాజమాన్య సంస్థలు మరియు ఖనిజాల రూపంలో ఉన్నాయి. ఈ సంపద భారతీయులకు చెందినది మరియు ప్రస్తుతం ప్రభుత్వం వద్ద నిరుపయోగముగా ఉంది..

గత 70 సంవత్సరాలలో, భారతదేశంలో వరుస ప్రభుత్వాలు దురదృష్టవశాత్తు ప్రజలకు మంచి జీవితాన్ని అందించడంలో మరియు మన వనరులను మన ప్రయోజనం కోసం ఉపయోగించడంలో విఫలమయ్యాయి. మన సంపదను ఎల్లపుడూ తప్పుగా ఉపయోగించడం మరియు దుర్వినియోగం చేస్తున్నారు. మనము సంపన్న దేశంలో నివసించాలనుకుంటే మరియు మన పిల్లలకు సురక్షిత భవిష్యత్తు కావాలనుకుంటే శాశ్వత పేదరికం, నిరుద్యోగం, విద్య లేకపోవడం, అనారోగ్యం మరియు అవినీతి లేకుండా చేయాలి.

ప్రతి భారతీయుడికి మిగులు ప్రజా సంపద యొక్క సంరక్షించే విలువ రూ. 10 లక్షల కన్నా ఎక్కువ. మనం ఎందుకు ఎల్లపుడూ బాధపడుతూ ఉండాలి? మన పిల్లలు ఎందుకు ఆకలితో పడుకోవాలి? మౌలిక అవసరాలను తీర్చడానికి మన ప్రజలు ఎందుకు కష్టపడాలి?

భారతీయులను సంపన్నులుగా చేయడానికి మనకు అధికారం ఉంది. భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. చాలా కాలం నుండి నిరుపయోగముగా ఉన్నదాన్ని సరిచేయాలని, నైతికంగా సరైనదిగా చేయాలని మేము మిమల్ని కోరుతున్నాము. ప్రతి భారతీయ కుటుంబానికి రూ. 1 లక్ష తిరిగి పంపుతూ ధన్ వాపసిని వాస్తవం చేయండి. 130 కోట్ల భారతీయుల కలలు, ఆకాంక్షలు మన చేతుల్లో ఉన్నాయి.

ఇప్పుడ కాకపోతే, ఇంకెప్పుడు? మీరు కాకపోతే, ఇంకెవరు?

మనఃపూర్వకముగ,
మేము, భారతదేశ ప్రజలు.

వాగ్దానానికి మీ మద్దతును తెలపండి

సంతకం చేయడం ద్వారా, మీరు నయి దిషా నుండి అప్పుడప్పుడు అప్‌డేట్స్ అందుకుంటారు. మీరు ఏ సమయంలోనైనా అన్‌సబ్‌స్క్రైబ్ చేయవచ్చు.