రాజేష్ జైన్

రాజేష్ జైన్
Nayi Disha

మార్పునకు ఇదే మంచి స‌మ‌యం

వ‌చ్చే ఏడాది జ‌రగ‌బోయే క‌న్నా మంచి అవ‌కాశం మ‌న‌కి మ‌ళ్లీ దొర‌క‌దు. 2014 ఎన్నిక‌ల్లో బిజేపీ గెలిచిన‌ప్ప‌టికీ (అప్ప‌డు నేను కూడా నీతి డిజిట‌ల్ ద్వారా ప‌నిచేశా) వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా అదే జ‌రుగుతుంద‌ని క‌చ్చితంగా చెప్ప‌లేము. ఎందుకంటే వాగ్ధానం చేసిన విధంగా సంస్క‌ర‌ణ‌లేమీ జ‌రుగ‌లేదు. చిన్న ప్ర‌భుత్వం - పెద్ద పాలన పేరుతో చేసిన వాగ్ధానాన్ని అస్స‌లు నెర‌వేర్చుకోలేదు. ఆ ప‌దాల తాలూకు అర్ధాన్ని కూడా వారు తెలుసుకోలేక‌పోయారు. బంగారు భ‌విష్య‌త్తు కోసం ప్ర‌జ‌లు పెట్టుకున్న ఆశ‌ల్ని వారు అన్ని విభాగాల‌లోనూ నాశ‌నం చేశారు.

Rajesh Jain
February 1, 2018

రాజేష్ జైన్
Nayi Disha

న‌యీ దిశా తెచ్చే పెను మార్పు

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ముందే మేము ఒక స్ప‌ష్ట‌మైన ఎంపిక‌ను ఎదుర్కొంటున్నాము. అన్ని రాజ‌కీయ‌పార్టీలు విభ‌జ‌న పేరుతో పెట్టిన ఉచ్చులోనే మేం కూడా ప‌డిపోయే అవ‌కాశం ఉంది. రాజ‌కీయ నాయ‌కులు ద‌శాబ్ధాలుగా మ‌నల్ని కులం పేరుతో, మ‌తం పేరుతో విభ‌జించారు. పొరుగున ఉండేవారిని చూసే భ‌య‌ప‌డే ప‌రిస్థితి క‌ల్పించారు. దీర్ఘ‌కాలంగా మ‌ర్చిపోయిన చ‌రిత్ర‌నే త‌వ్వి ప‌దే ప‌దే గుర్తు చేస్తున్నారు. గ‌తాన్ని గుర్తు చేయ‌డం త‌ప్ప‌... రేప‌టి మ‌న కోసం ఏం చేస్తారో, భ‌విష్యత్తు ఆశ‌లు పెంచేలా ఎలాంటి యాక్ష‌న్ ప్లాన్ రూపొందించారో మాత్రం ఏ రాజ‌కీయ పార్టీ మాట్లాడ‌దు.

Rajesh Jain
January 31, 2018

రాజేష్ జైన్
Nayi Disha

బంధింపబడిన భారతీయుల సంపద

ఒక్కసారి మీ చుట్టూ చూడండి... మీ కంటికి కనిపిస్తున్న ఎన్నో ఇళ్లు ప్రతి ఊరిలో ఉంటాయి. ప్రతి ఊరిలో ఉన్న ప్రతి ఇంటికి చెందిన డబ్బులో చాలా భాగం ప్రభుత్వం తమ ఆధీనంలోనే ఉంది. అంతెందుకు కేంద్రమంత్రుల నివాసాలతో పాటూ అనేక బంగ్లాలు ఉన్న ల్యూటెన్ ఢిల్లీ ప్రాంతం నుంచి ప్రతి జిల్లాలో ఖాళీగా పడి ఉన్న ఖాళీ స్థలాల వరకు ఎన్నో ఆస్తులు ప్రభుత్వానికే చెందుతాయి. ల్యూటెన్స్ ఢిల్లీ ప్రాంతంలో ఉన్న ఒక్కో బంగ్లా ధర అయిదు వందల కోట్లకు తక్కువ లేకుండా ఉంటుంది. ఎప్పుడో వందల ఏళ్ల క్రితం నుంచి భారతదేశం అంతటా అనేక భూములు రక్షణ శాఖ ఆధీనంలోకి వెళ్లాయి. ఇలా ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ప్రతి ఎకరం భూమి... దేశ శ్రేయస్సు, సంపన్నతను నిరోధించే వ్యవస్థలో భాగమే.

Rajesh Jain
January 30, 2018