వారి కాలం చెల్లింది

వారంతా స్వాతంత్ర్య భారతావనికి విలన్ల వంటి వారు. భారత దేశ పేదరికానికి, పిసినారి తనానికి మూల కారణాలు వారే. వారు మనల్ని నిరక్షరాస్యులుగా, ఆకలితో, నిరుద్యోగులుగా మార్చారు. వారంతా ఒక్కటై దశాబ్ధాలుగా తొంభై శాతం మన సంపదను దోచుకున్నారు. మనం పది రెట్లు శ్రీమంతులం అయ్యే అవకాశాన్ని అడ్డుకున్నారు. వాళ్లు ఎవరో కాదు… భారత రాజకీయ నాయకులు. వారి గడువు ముగిసింది.

మార్గం మన ముందే ఉంది

భారతావనిలో ఉన్న ప్రతి వ్యక్తిని ధనవంతుడిగా మార్చే దారి మన ముందే స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నూతన భారతావనిలో ప్రతి భారతీయుడు లాభాన్ని పొందుతాడు. ఇది కొన్ని సంవత్సరాలలోనే సాధించవచ్చు, తరాలుతరాలు ఎదురు చూడాల్సిన అవసరం లేదు.

భారతీయులను సంపన్నులుగా చేయడమే నయీ దిశా ప్రాథమిక సూత్రాలకు పునాది. ఈ సూత్రాలను ప్రభుత్వ పాలసీలో చేర్చి, రెండు నయీ దిశా ప్రాథమిక సూత్రాలను అమలు చేయడానికి (ప్రతి కుటుంబానికి ఏడాదికి లక్ష రూపాయలు ఇవ్వడం, అన్ని పన్నులను గరిష్టంగా పదిశాతానికి కుదించడం) ప్రజల చేత , ప్రజల కొరకు ఎన్నుకోబడిన కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.

ఇది సాకారం చేయడానికి రాజకీయ పార్టీలకు అండగా ఉండని ప్రతి భారతీయుడు చేయి చేయి కలిపితేనే సాధ్యం అవుతుంది. ప్రతి భారతీయుడు ముందుకు వచ్చి కొత్త భవిష్యత్తను నిర్మించడానికి తన వంతు సాయం చేయాలి. మనం మూడింట రెండొంతుల మందిమి, ఇప్పటికీ వాయిస్ లేదని అనుకుంటాం. మూడింట రెండొంతుల మందిమి, ఇప్పటికీ మనకి సాయం చేసేందుకు ఎవరూ లేరని అనుకుంటాం. మనం భారతదేశ నడిబొడ్డులో ఉన్నప్పటికీ, మనం దేశాన్ని వదిలి పోతున్నట్టు భావిస్తాం. ఎందుకిలా అంటే…. మనకు తెలియదు… మనలాంటి వాళ్లు దేశంలో చాలా మంది ఉన్నారని. మనకి మన సొంత శక్తి సామర్థ్యాల గురించి తెలియదు… అందుకే అలా ఫీలవుతున్నాం.

ఇదే మార్పునకు మంచి సమయం

ఇదే మంచి తరుణం… మనమంతా ఏకం కావడానికి. కేవలం ఎస్సెమ్మెస్ ద్వారా నయీ దిశాలో సభ్యుడిగా మారచ్చు. అలాగే మరో పది మందికి నయీ దిశా గురించి తెలిసేలా చేయడం. చివరికి, ఎన్నికల రోజు కేవలం అరగం సమయాన్ని వెచ్చించి ఓటేసి రావడం. అంతే… ఒక ఎస్సెమ్మెస్, పదిమంది స్నేహితులు, అరగంట సమయం. మీ భాగస్వామ్యం నయీ దిశా విజయవంతం కావడానికి, దేశం కొత్త దారిలో నడవడానికి ఉపకరిస్తుంది.

మనమంతా ఏకమైతే ఏ శక్తీ మనల్నీ ఆపలేదు. కానీ మొదటి అడుగు మనం వేయాల్సి ఉంది. మీ కాలం చెల్లింది, మీ గడువు ముగిసింది అన్న సందేశాన్ని మనం రాజకీయ నాయకులకు పంపాల్సి ఉంది. 70 ఏళ్లలో … మూడు తరాల భారతీయులను ఆర్ధికంగా ఎదగకుండా వారు అడ్డుకున్నారు. వారి ఆనందాన్ని, సంపదను దోచుకున్నారు. అందుకే మార్పుకు ఇదే మంచి సమయం.

మీ ఛాయిస్ ఏంటీ?

ప్రతి ఒక్కరు నిర్ణయం తీసుకోవాల్సిన తరుణం ఇది. ఇంకా ఇప్పటి పరిస్థితులనే కొనసాగించాలా? లేక కొత్త మార్పును స్వాగతించాలా అని.